భార్యను పెళ్లి చేసుకున్న నటుడు.. అసలు కారణం ఇదే! | Sakshi
Sakshi News home page

Ronit Roy: భార్యను రెండోసారి పెళ్లాడిన నటుడు.. ఎందుకంటే?

Published Tue, Dec 26 2023 6:39 PM

Bollywood Actor Ronit Roy marries wife Neelam again at 58 - Sakshi

బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్(58) మరోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన భార్య నీలం బోస్‌ రాయ్‌ను రెండోసారి వివాహాం చేసుకున్నారు. ఈ వేడుక గోవాలోని ఓ ఆలయంలో జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నటుడు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. రెండోసారే కాదు.. వెయ్యి సార్లైనా నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 

అయితే వీరిద్దరికి పెళ్లై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో రెండోసారి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మరోసారి తన భార్య నీలం బోస్ రాయ్‌ను పెళ్లి చేసుకుని మధురమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న  బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా.. రోనిత్, నీలం పెళ్లికి ముందు మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2003లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Advertisement
 
Advertisement