Actress Meena: వెడ్డింగ్‌ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్‌ పోస్ట్‌

Meena Shares Emotional Post About Late Husband On Wedding Anniversary - Sakshi

నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా, నటిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె రీసెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సహానటి, క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే గత నెల మీనా భర్త విద్యాసాగర్‌ హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే.

చదవండి: లలిత్‌ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటూ వీడియో..

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్‌ కోవిడ్‌, ఊపరితిత్తుల సమస్యలతో అనారోగ్య బారిన పడ్డారు. ఆయన లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ జూన్‌ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ నోట్‌ పంచుకుంది.

చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి

భర్త విద్యాసాగర్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం(బహుమతి). కానీ చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా(నా) గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతరాలిని. మీలాంటి వారి ఆశ్వీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి’ అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా మీనా, విద్యాసాగ‌ర్ను  2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top