17th Wedding Anniversary Of Mahesh Babu And Namrata: Mahesh Babu Special Wishes To Namrata - Sakshi
Sakshi News home page

Mahesh- Nmamratha: జీవితాంతం ఇలానే కొనసాగిద్దాం.. మహేశ్‌బాబుకు నమ్రత విషెస్‌

Feb 10 2022 1:53 PM | Updated on Feb 10 2022 3:31 PM

Mahesh Babu Sweet Wishes Namrata Shirodkar On Wedding Anniversary - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మహేశ్‌బాబు. నటనాచాతుర్యంతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ హీరో. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోగా రాణిస్తున్న మహేశ్‌ నమ్రత శిరోద్కర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'వంశీ' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్లింది.

వీరి వివాహం జరిగి నేటికి 17 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్‌ ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేసి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 'అప్పుడే 17 సంవత్సరాలు పూర్తైంది. హ్యాపీ యానివర్సరీ.. ఇలాంటి రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి' అని రాసుకొచ్చాడు. ఇక నమ్రత కూడా స్పెషల్‌ వీడియో ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 'సంతోషం, నమ్మకం, గౌరవం, కరుణ, సరదాతో కొనసాగిన మన ప్రేమను జీవితాంతం ఇంతే మధురంగా కొనసాగిద్దాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement