జూనియర్‌ ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతిల పెళ్లి రోజు

Jr Ntr, Lakshmi Pranathi Wedding Anniversary, Fans WIshes - Sakshi

నందమూరి వారసుడు, నవరసాలు పలికించగల ధీరుడు.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. నటనకు ప్రాణం పెట్టే తారక్‌ కుటుంబాన్ని కూడా ఎంతో ప్రాణంగా చూసుకుంటాడు. నేడు(మే 5) ఆయన పెళ్లి రోజు. దీంతో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌, భార్య లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆనాడు డిజైన్‌ చేయించిన వివాహ పత్రిక విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు పెళ్లిరోజు శుభాకాంఓలు తెలియజేస్తున్నారు.

కాగా 2011లో ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగింది.  2014లో వీరికి తొలి సంతానంగా అభయ్‌రామ్‌ జన్మించాడు. 2019లో భార్గవ్‌ రామ్‌ పుట్టాడు. ఈ మధ్యే అతడిని బండి మీద ఎక్కించుకుని తారక్‌ హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ప్రస్తుతం అతడు కొమురం భీమ్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు. సుమారు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌. ఎట్టకేలకు దీని కథ క్లైమాక్స్‌కు వచ్చింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు.

(ఎన్టీఆర్‌ దంపతుల ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. వెనకడుగు వేసిన యంగ్‌ టైగర్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top