‘శ్రీమహలక్ష్మి’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన మలయాళీ భామ పూర్ణ
వివాహబంధంలో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి అయినట్లు పూర్ణ కొన్ని ఫోటోలు పంచుకుంది
దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో 2022లో పూర్ణ వివాహం అయింది
కొద్దిమంది అతిథుల సమక్షంలో దుబాయ్‌లో వీరు ఒక్కటయ్యారు.
ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు
2023లో ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు
పెళ్లిరోజు సందర్భంగా పూర్ణ ఇలా పేర్కొంది 'నా హృదయంలో చోటిస్తే.. తన జీవితాన్నే ఇచ్చేశాడు' అని పోస్ట్ చేసింది.


