పెళ్లి రోజు.. మంచు విష్ణు ట్వీట్‌ | Manchu Vishnu Wedding Anniversary Wishes To His Wife Viranica | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజు.. మంచు విష్ణు ట్వీట్‌

Mar 1 2020 3:10 PM | Updated on Mar 1 2020 3:42 PM

Manchu Vishnu Wedding Anniversary Wishes To His Wife Viranica - Sakshi

హీరో మంచు విష్ణు.. తన భార్య విరానికకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా తన ప్రేమను తెలిపేలా విష్ణు ఓ ఫొటోను షేర్‌ చేశారు. L,O,V,E అక్షరాలతో కూడిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అలాగే కొన్నేళ్ల కిందట ఇదే రోజు.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. విరానిక తనకు జీవితంలో ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. మరోవైపు విరానిక కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన భర్తపై ప్రేమను వెల్లడించారు. ‘ఇప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పటికీ.. నువ్వు నా వాడివి. అనంతంగా నిన్ను ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

2009లో విష్ణు, విరానికలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’ షూటింగ్‌ చివరి దశలో ఉంది.కాజల్‌ అగర్వాల్, రుహాని సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ సిక్కు పోలీసాఫీసర్‌గా బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. వియామార్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.వి.ఎ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై విరానికా మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement