పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్‌ ఎందుకు వండలేదు..! | Hyderabad Man Arrested For Beating Wife Over Chicken On Wedding Anniversary, More Details Inside | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్‌ ఎందుకు వండలేదు..!

Jul 3 2026 8:11 AM | Updated on Jul 3 2026 9:57 AM

wife and husband incident in hyderabad

హైదరాబాద్‌: వివాహ వార్షికోత్సవం రోజే ఇంట్లో చికెన్‌ వండలేదని భార్యపై దాడి చేసిన భర్తను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు... బీఎస్‌ మక్తలో నివాసం ఉన్న ప్లంబర్‌ ప్రతాప్‌ (42), భార్య దీపికతో నివాసముంటున్నారు. 

జూన్‌ 26న వీరి వివాహ వార్షికోత్సవం. ఆ రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు భోజనం వడ్డించగా, ‘‘పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్‌ ఎందుకు వండలేదని’’ గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతాప్‌ పక్కనే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రిలో చేరి్పంచారు. కోలుకున్న తరువాత దీపిక పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతాప్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement