క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం | Allu Arjun Share post for Sneha over their 15th Anniversary Post about Sneha | Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు అర్జున్‌- స్నేహ పెళ్లిరోజు.. బన్నీ పోస్ట్‌ చూశారా?

Mar 6 2026 12:12 PM | Updated on Mar 6 2026 12:36 PM

Allu Arjun Share post for Sneha over their 15th Anniversary Post about Sneha

టాలీవుడ్‌ స్టార్‌ జంట అల్లు అర్జున్‌- స్నేహ నేడు (మార్చి 6న) 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్ధాంగితో దిగిన ఫోటోను బన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం.. నువ్వు లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదు అని అందమైన క్యాప్షన్‌ జోడించాడు. ఇది చూసిన అభిమానులు బన్నీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌
సినిమాల్లో లవర్‌బాయ్‌గా మెప్పించిన అల్లు అర్జున్‌ నిజజీవితంలో కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మనసులు కలిశాయి. కానీ పెద్దలు ఒప్పుకోలేదు.

పెళ్లి
ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తేల్చి చెప్పేశారు. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2010 నవంబర్‌ 26న అల్లు అర్జున్‌- స్నేహ నిశ్చితార్థం జరిగింది. 2011 మార్చి 6న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2014లో వీరికి కుమారుడు అయాన్‌ జన్మించగా.. మరో రెండేళ్లకు కూతురు అర్హ పుట్టింది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకుని మరీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. వారితో కాలక్షేపం చేస్తుంటాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement