సీట్ల కోసం సిగపట్లు | - | Sakshi
Sakshi News home page

సీట్ల కోసం సిగపట్లు

Jan 30 2026 6:45 AM | Updated on Jan 30 2026 6:45 AM

సీట్ల

సీట్ల కోసం సిగపట్లు

8లోu శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026

బీజేపీ, కాంగ్రెస్‌లలో పోటాపోటీ

నేతల మధ్యలో విభేదాలు

వర్గాలుగా విడిపోయిన వార్డులు

బీఫామ్‌ ఇచ్చేదాకా గ్యారంటీ లేదు

నిర్మల్‌

అరైవ్‌–అలైవ్‌.. ప్రమాదాలకు చెక్‌!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

5న ‘చలో పార్లమెంట్‌’

భైంసాటౌన్‌: సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో పార్లమెంట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్‌ డిమాండ్‌ చేశా రు. ఈ మేరకు పట్టణంలోని సంఘ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు, నూతన విద్యావిధానంపై తక్షణ సమీక్ష డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా చేయనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణ్‌, కార్యదర్శి బాజారెడ్డి, ఆర్థిక కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌, భైంసా, కుభీర్‌ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

నిర్మల్‌: మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల్లో నేతల మధ్య పంచాయితీ పెడుతున్నాయి. ఇప్పటికే వర్గాలుగా ఉన్న నాయకులు వార్డుల్లో తమవాళ్లకు టికెట్లు ఇ ప్పించుకునే విషయంలో నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకునేదాకా చేరింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం ముగియనుంది. అయినా.. గురువారం సాయంత్రం వరకూ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్‌లో మాత్రం కొంతమందికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, నామినేషన్లను వేసుకోమని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అలా గ్రీన్‌సిగ్నల్‌ అందినవాళ్లు ఆగమేఘాల మీద మొదటిసెట్‌ నామినేషన్లు గురువారం వేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండోరోజు 123నామినేషన్లు దాఖలయ్యాయి.

బీఫామ్‌ ఇచ్చేదాకా డౌటే...

‘తమ్ముడూ.. కంగ్రాట్స్‌. ఇంకేం నీకే ఇచ్చిండ్రట పార్టీ టికెట్‌. సార్‌ కూడా నామినేషన్‌ వేసుకోమని చెప్పిండట కదా..’ అని చెబితే.. ‘అన్నా.. ఇక్కడ పరిస్థితి వేరే ఉందన్న. ఎవరికి టికెట్‌ ఇస్తరో, ఎవరి ని దూరం పెడతరో తెలుస్తలేదు. నామినేషన్‌ నాకే కాదు, మావార్డులో మరొకరికీ వేసుకోమని చెప్పా రు. చివరకు ఎవరికి బీఫామ్‌ ఇస్తరో తెలియదన్న..’ అని సదరు పార్టీ ఆశావహుడు వాపోయాడు. నిర్మల్‌ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్లకు ఈ ఒక్కరోజే గడువున్నా.. తమ అభ్యర్థుల పేర్లను, బీఫామ్‌ ఎవరికి ఇవ్వనున్నామనే విషయాలను కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూడు పార్టీలు వెల్లడించకపోవడం గమనార్హం.

జిల్లా అధ్యక్షులూ.. ఎక్కడ..!?

మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలనేది పీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తారని సీఎం పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడే ఎ వరెవరు పోటీలో ఉంటారనేది ఫైనల్‌ చేస్తారని బీజేపీ సీనియర్లు చెప్పారు. కానీ.. జిల్లాకు వచ్చేసరి కి పరిస్థితి ఉల్టా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల లొల్లి ప్రారంభమై మూడోరోజుకు చేరుకున్నా.. రెండు ప్ర ధాన పార్టీల జిల్లా అధ్యక్షులు అభ్యర్థిత్వా ల ఖరారు ప్రక్రియలో కనిపించడం లేదు. బీజేపీలో నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిన జాబితానే ఫైన ల్‌ అన్నట్లు నడుస్తోంది. కాంగ్రెస్‌లో స్థానిక సీనియర్‌ నేతలు చెప్పిన పేర్లే దాదాపు ఖరారు అని చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌ ఇద్దరూ దాదాపు ఖానాపూర్‌ మున్సిపల్‌ వరకే పరిమితమైనట్లు ప్రచారం సాగుతోంది.

నామినేషన్‌ వేసేందుకు వస్తున్న బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి యోగిత

పార్టీల్లో ఫైట్‌..

‘ఇన్నేళ్లు పార్టీకోసం పనిచేసిన నా మనిషికి టికెట్‌ ఇవ్వరా.. ఏమనుకుంటున్నరు..’అని ఒక సీనియర్‌ నేత అంటే.. ‘నా వార్డులో నీ మనిషికి టికెట్‌ ఎట్ల ఇస్తరో చూస్త..’అని మరో సీనియర్‌ నేత వాగ్వాదానికి దిగారు. మరోచోట.. ‘మేం చెప్పినవాళ్లకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినవారికి టికెట్‌ ఇస్తామంటే కుదరదు..’ అంటూ యువరక్తం గల్లాలు పట్టి అడిగేదాకా పరిస్థితి చేరింది. ఇంకోపార్టీలో ‘ఇంత సీనియారిటీ ఉన్నా.. కనీసం మా పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే ఇన్నేళ్లు పార్టీకి మేం చేసిన సేవలు కనిపించడం లేదా..! మీ ఎన్నికలప్పుడే మేం కనిపిస్తామా..! దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న మమ్మల్ని కాదని, నిన్నమొన్న వచ్చినోళ్లకు టికెట్లు ఇస్తరా..!?’ అంటూ ఓ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకులు, క్యాడర్‌ వర్గాలుగా విడిపోయి, వార్డుల్లో పోటీపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు.. ఇప్పుడు జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి. ఓ పార్టీలో కొంతమంది సీనియర్‌ నేతలు తమను నమ్ముకున్నవాళ్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ముఖం చాటేస్తున్నారు.

సీట్ల కోసం సిగపట్లు1
1/2

సీట్ల కోసం సిగపట్లు

సీట్ల కోసం సిగపట్లు2
2/2

సీట్ల కోసం సిగపట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement