గద్దెకు చేరిన సమ్మక్క
7
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్న భక్తులు
ముధోల్: ముధోల్ మండలం ఎడ్‌బిడ్ తండాలో సమ్మక్క– సారలమ్మల జాతర గురువారం రెండో రోజు కొనసాగింది. సమ్మక్కను గిరిజన పూజారులు గద్దైపెకి తీసుకువచ్చారు. అమ్మవారు వనం నుంచి గద్దైపెకి చేరుకోవడంతో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. పూజలు చేశారు. సమ్మక్క – సారలమ్మ మొక్కులు తీర్చుకుని నిలువెత్తు బంగారం(బెల్లం) ఒడి బియ్యం సమర్పించారు. మేకలు, కోళ్లతో మొక్కులను తీర్చుకున్నారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త జాదవ్ సతీశ్‌కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
గద్దెకు చేరిన సమ్మక్క


