శ్రీసంత్‌ రవిదాసు పుస్తక పరిచయం | - | Sakshi
Sakshi News home page

శ్రీసంత్‌ రవిదాసు పుస్తక పరిచయం

Feb 9 2026 8:08 AM | Updated on Feb 9 2026 8:08 AM

శ్రీసంత్‌ రవిదాసు పుస్తక పరిచయం

శ్రీసంత్‌ రవిదాసు పుస్తక పరిచయం

నిర్మల్‌ఖిల్లా: జిల్లా కవి, రచయిత కడారి దశరథ్‌ రచించిన ‘శ్రీ సంత్‌ రవిదాసు’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలోని మోచి సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. సంత్‌ రవిదాసు జీవితం, ఆయన చేపట్టిన భక్తి ఉద్యమం, మధ్యయుగ కాలంలో సమాజంలో ప్రబలంగా ఉన్న అసమానతలు, అంధవిశ్వాసాలు వంటి రుగ్మతలను రూపుమాపడంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. సంత్‌ రవి దాసు భక్తి మార్గం ద్వారా సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజ ల్లోకి తీసుకువచ్చారని కొనియాడారు. అనంతరం పుస్తక రచయిత కవి కడారి దశరథ్‌ను సన్మానించా రు. కవి కడారి దశరథ్‌తోపాటు సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు కావల్ల సాయన్న, కోశాధికారి అల్లకొండ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement