ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా | - | Sakshi
Sakshi News home page

ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా

Feb 13 2026 5:47 AM | Updated on Feb 13 2026 5:47 AM

ప్రకృ

ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా

కడెం: పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ కరువై మందుబాబులకు అడ్డాలుగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రకృతి వనాలను కా పాడుకునేందుకు మండలంలోని లింగాపూర్‌ పంచాయతీ పాలకవర్గం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వనంలో మద్యం సేవిస్తే రూ.2 వేలు జరిమానా, మద్యం సేవిస్తుండగా ఫొటోలతో సమాచారం అందించిన వారికి రూ.500 బహుమతి చెల్లించనున్నట్లు సర్పంచ్‌ కుమ్మరి రంజిత్‌ తెలిపారు. ఈమేరకు పల్లె ప్రకృతి వనాల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో కార్యదర్శి రాజు,ఉప సర్పంచ్‌ కమ్మల స్వామి, ఏఎఫ్‌ఏ రాజు, గ్రామస్తులు ఉన్నారు.

నాన్‌ గెజిటెడ్‌ వెటర్నరీయన్‌ అసోసియేషన్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: నాన్‌ గెజిటెడ్‌ వెటర్నరీయన్‌ అసోసియేషన్‌ జిల్లా ఎన్నికలు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాల యం ప్రాంగణంలో గురువారం నిర్వహించా రు. అధ్యక్షుడిగా జె.జ్ఞానేశ్వర్‌, కార్యదర్శిగా అల్లం హరీశ్‌, కార్యనిర్వహక అధ్యక్షుడిగా తోట అమృతం, కోశాధికారిగా ఉమారాణి, ఆర్గనైజేషన్‌ సెక్రెటరీగా క్రాంతికుమార్‌ను ఎన్నుకున్నారు. టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కుడాల రవి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, టీఎన్జీవో ప్రతినిధులు అభిషేక్‌రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

లక్ష్మణచాంద: రైతులు పంటలకు సేంద్రియ ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌ తెలిపారు. సోన్‌ మండలం మాదా పూర్‌ గ్రామంలో సేంద్రియ ఎరువులతో పసుపు సాగుచేసి మంచి దిగుబడి సాధించిన యువరైతు మింకరాజ్‌ కిరణ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఆర్గానిక్‌ నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి సేంద్రీయ ఎరువులతోపాటు సూక్ష్మధాతు పోషకాలు, ట్రైకోడెర్మ వంటి జీవన ఎరువులను వినియోగించడంతో యువరైతు అధిక దిగుబడి సాధించాడని తెలిపారు. మార్కెట్‌లో వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిన ఎరువులు మాత్రమే రైతులు వాడాలన్నారు. ఆయన వెంట ఏఈవో అశోక్‌కుమార్‌, విశ్వ అగ్రిటెక్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ కృష్ణ, రైతులు మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రకృతివనంలో మద్యం  తాగితే జరిమానా1
1/2

ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా

ప్రకృతివనంలో మద్యం  తాగితే జరిమానా2
2/2

ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement