‘మున్సిపల్’లో కాంగ్రెస్‌దే పైచేయి
ఖానాపూర్: జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. మున్సిపల్ ఎన్ని కల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ చేసిన అసత్య ప్రచారాలను, జేఏసీ పేరిట దొరలు ఆడిన నాటకాలను ప్రజలు నమ్మలేదన్నారు. పదేళ్ల ఖానాపూర్ వెనుకబాటుకు కొంతమంది దొరలే కారణమని విమర్శించారు. గోండు బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం దొరల ఆటలు సాగవని స్పష్టం చేశారు. ఖానాపూర్‌లో 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని బీఆర్‌ఎస్, బీజేపీ చేసిన కుట్రలను ప్రజలు గమనించార ని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు వేయాలని జేఏసీ నాయకులు ప్రచారం చేశారని తెలిపారు. జేఏసీ నాయకులు ప్రజలపక్షాన ఉంటే వారే జేఏసీ తరఫున అభ్యర్థులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆయా పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని వారి అభ్యర్థులకు లాభం చేకూరేలా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారన్నారు. సమవేశంలో దయానంద్, ఎంఏ.మాజిద్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, యూసుఫ్‌ఖాన్, కావలి సంతోష్, నిమ్మల రమేశ్, ద్యావతి రాజేశ్వర్, జన్నారపు శంకర్, కస్తూరి మహేందర్, నేత శ్యాం, అమానుల్లాఖాన్, షౌకత్‌పాషా, రాజేందర్‌నాయక్, జంగిలి శంకర్, షబ్బీర్‌పాషా, గంగనర్సయ్య, వెంకటప్పయ్య, మ్యాదరి రాజేశ్వర్, తూము చరణ్, అయూబ్ పాల్గొన్నారు.


