నేడే ‘పుర’ తీర్పు!
నిర్మల్‌చైన్‌గేట్:మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్, భైంసా, ఖానాపూర్ నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఈ నెల11న మూడు మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఓట్లు లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను మూడు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన టేబుల్‌పై లెక్కిస్తారు.
రెండు రౌండ్లలో పూర్తయ్యేలా...
జిల్లాలోని బైంసా, ఖానాపూర్, నిర్మల్ మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు ఉన్నాయి. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. 244 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 44 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ 42 వార్డులకు సంబంధించి 22 టేబుళ్లను, భైంసా మున్సిపాలిటీలోని 26 వార్డులకు 13, ఖానాపూర్ నియోజకవర్గంలోని 12 వార్డులకు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారి కాకుండా ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్‌ను నియమించారు. వీరి సమక్షంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియను సాయంత్రం 4 గంటలలోపు ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభం..
తొలుత అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూములను తెరవనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు బ్యాలెట్ బాక్సులలో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపు కోసం సుమారు 60 మంది సూపర్‌వైజర్లు, 121 మంది సూపర్‌వైజర్ అసిస్టెంట్లతోపాటు ఇతర అధికారులు విధుల్లో ఉండనున్నారు.
నిర్మల్ కౌంటింగ్ వివరాలు..
వార్డులు:42
ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 22, ఒకటి పోస్టల్ బ్యాలెట్
కావాల్సిన సూపర్‌వైజర్లు: 23
రిజర్వ్‌లో సూపర్‌వైజర్లు: 05
కౌంటింగ్ అసిస్టెంట్లు: 46
రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 09
మొదటిరౌండ్‌లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41.
రెండోరౌండ్‌లో లెక్కించే వార్డులు: 2, 4 , 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42.
భైంసా కౌంటింగ్ వివరాలు..
వార్డులు:26
ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 13, ఒకటి పోస్టల్ బ్యాలెట్
కావలసిన సూపర్‌వైజర్లు: 14
రిజర్వ్ లో సూపర్‌వైజర్లు: 03
కౌంటింగ్ అసిస్టెంట్లు: 28
రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 06
మొదటిరౌండ్‌లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25.
రెండోరౌండ్‌లో లెక్కించే వార్డులు: 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26.
ఖానాపూర్ కౌంటింగ్ వివరాలు..
వార్డులు: 12
ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 06, ఒకటి పోస్టల్ బ్యాలెట్
కావాల్సిన సూపర్‌వైజర్లు : 07
రిజర్వ్‌లో సూపర్‌వైజర్లు : 01
కౌంటింగ్ అసిస్టెంట్లు: 14
రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 3
మొదటిరౌండ్‌లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11
రెండోరౌండ్‌లో లెక్కించే వార్డులు: 2, 4, 6, 8, 10, 12


