నామినేషన్లకు నేడే ఆఖరు..
నిర్మల్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. తొలిరోజు నిర్మల్‌లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండోరోజు గురువారం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 128 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం చాలామందికి కలిసి వస్తుండటంతో మూడు మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే నామినేషన్ల జాతర ఉండనుంది. రెండురోజులుగా మున్సిపల్ ఖజానాకూ పన్నుల రూపంలో రాబడి పెరుగుతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు వారిని బలపరుస్తున్నవారూ మున్సిపల్ పన్నులను చెల్లించాలనే నిబంధన ఉండటమే ఇందుకు కారణం.
భైంసాలో 68 నామినేషన్లు..
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భైంసాలో రెండోరోజు నామినేషన్ల జోరు కనిపించింది. తొలిరోజు కేవలం రెండు నామినేషన్లు దాఖలు కాగా, గురువారం ఒక్కరోజే 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం పార్టీ నుంచి 18 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎండీ.జాబీర్‌అహ్మద్ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 70 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీర సంకేత్‌కుమార్ తెలిపారు.
ఖానాపూర్‌లో 23..
ఖానాపూర్: ఖానాపూర్‌లో గురువారం 23 నామినేషన్లు దాఖాలయ్యాయని కమిషనర్ సుందర్‌సింగ్ తెలిపారు. బుధవారం 3 నామినేషన్లు రాగ, రెండు రోజుల్లో 26 నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.


