సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు
నిర్మల్ రూరల్: జిల్లాస్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పోటీలు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ప్రశ్నాపత్రాన్ని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రైజ్‌మనీ అందజేశారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పాత కార్యవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. కొత్తగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా గంగాధర్‌ను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్, భూషణ్, గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పోతన్న, ఆంజనేయులు, అనిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.


