అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మా ట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాల ని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘవ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు


