కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులకు సోమవా రం బీ–ఫాంలు అందజేశారు. పార్టీ చేపట్టిన సర్వేల మేరకు అభ్యర్థులను ఖరారు చేశామని తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


