నిర్మల్
రథాలపై శివ కేశవులు
నిర్మల్ రూరల్ మండలం ముజ్గిలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. మరోవైపు కడెం మండలం అక్కకొండ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో వాగంగా దేవదేవులు మల్లన్న, లక్ష్మీనృసింహస్వామి సోమవారం ఉదయం రథాలపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథాలపై ఉంచి ఊరేగించారు. జాతరలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవ దేవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నమో మల్లన్న.. నమో నారసింహ నినాదాలతో జాతర ప్రాంగణాలు మార్మోగాయి. కార్యక్రమాల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముజ్గి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అక్కకొండ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– నిర్మల్ రూరల్/కడెం
బండారి పట్టుకుని నృత్యం చేస్తున్న యాదవులు
ఇళ్లపైకి ఎక్కి రథోత్సవాన్ని తిలకిస్తున్న ప్రజలు, భక్తులు
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


