మల్లయోధుల కుస్తీ
తానూరు: మండల కేంద్రం తానూరుతోపాటు ఎల్వి గ్రామాల్లోని మల్లన్న దేవుని ఆలయాల్లో సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. తానూరులో మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. ఎల్వి గ్రామంలో భక్తులు ఉదయం పూజలు నిర్వహించి మల్లన్న పల్లకిని వీధుల్లో ఉరేగించారు. పల్లకి కార్యక్రమంలో పాల్గొని భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎల్వి గ్రామంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


