‘మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ’ పై అవగాహన
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాసర సర్కిల్‌లోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అడవిని అనుకుని ఉన్న గ్రామాలు వన్యప్రాణులతో మానవులకు ఏర్పడే సంఘర్షణలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ జిల్లా అటవీ శాఖ అధికారులు సుశాంత్ సుఖదేవ్ బోబడే, ప్రశాంత్ పాటిల్, రవి ప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, నాలుగు జిల్లాల ట్రైబల్ వెల్ఫేర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఎలక్ట్రిసిటీ అధికారులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అరణ్య ఎన్జీవో సభ్యులు, సర్పంచులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


