జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు సోమవారం మూడో రోజు కొనసాగాయి. కబడ్డీ, యోగా, తైక్వాండో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఉషూ, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, సేపక్ తక్రా, రెజ్లింగ్ తదితర పోటీలు నిర్వహించారు. మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం గెలిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


