ఒక్క రోడ్డూ సక్కగ లేదు..
జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్, శ్రీనగర్‌కాలనీ తదితర కాలనీల్లో రోడ్లు సక్కగ లేవు. వర్షాకాలం నడవడమూ కష్టమే. డ్రైనేజీలు లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వస్తోంది.
– జొన్న వినోద్‌కుమార్
ఇప్పటికీ తాగునీటి సమస్య..
జిల్లా కేంద్రంలోని చాలా కాలనీలకు ఇప్పటికీ తాగునీరు అందడం లేదు. పాతబస్తీలోని వీధుల్లో మురికి కాలువల గుండా ఉన్న పైప్‌లైన్లు లీకవుతున్నాయి. నీరు కలుషితమై ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. – ఒడ్నం మహేందర్
ట్రాఫిక్ చికాకు పెడుతోంది..
పేరుకు జిల్లాకేంద్రం అన్నట్లే కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ప్రధానరోడ్లు, చౌరస్తాలు, ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో నిత్యం చికాకు పెడుతోంది. పండుగలప్పుడు మరీ ఇబ్బందవుతోంది.
– పోల కృష్ణ
ఒక్క రోడ్డూ సక్కగ లేదు..
ఒక్క రోడ్డూ సక్కగ లేదు..


