స్వేచ్ఛగా ఓటు వేయండి | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా ఓటు వేయండి

Feb 10 2026 8:05 AM | Updated on Feb 10 2026 8:05 AM

స్వేచ్ఛగా ఓటు వేయండి

స్వేచ్ఛగా ఓటు వేయండి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పౌరులంతా ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని, ప్రలోభాలకు తలొగ్గకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సూచించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ మినీ స్టేడియం వరకు స్వీప్‌(సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) ఆధ్వర్యంలో సోమవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కలెక్టర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పలు పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపేలా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమన్నారు.

బ్యాంకింగ్‌ కేవైసీ పూర్తి చేయాలి..

ప్రజలందరూ బ్యాంకింగ్‌ కేవైసీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో సైబర్‌ మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామ్‌గోపాల్‌, డీఈవో భోజన్న, ఎకై ్సజ్‌ అధికారి ఎంఏ.రజాక్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement