ఆయన మనోడేనా..? | - | Sakshi
Sakshi News home page

ఆయన మనోడేనా..?

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

ఆయన మనోడేనా..?

ఆయన మనోడేనా..?

నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా ప్రధాన పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గడపగడపకూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో హామీలు ఇస్తున్నారు. మాటలు చెబుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. అయితే కొందరు అనుచరులు ప్రత్యర్థి వర్గాలకు తమ వ్యూహాల సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంపై బరిలో ఉన్న అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఆందోళన చెదుతున్నారు. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలు ప్రత్యర్థులకు తెలిసిపోకుండా అప్రమత్తమవుతున్నారు. వ్యూహాల అమలు వివరాలను గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు రాబట్టేలా ప్రణాళికలు రచించి, అనుచరులను సమాయత్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘‘మన అనుచరవర్గంలో ఉన్నవాళ్లంతా నిజంగా మనోళ్లేనా?’’ అనే ప్రశ్న తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement