అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షీద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.


