నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి స్పాట్‌ను ఆర్జేడీ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ మార్గదర్శక ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సమాధాన పత్రాల పంపిణీ, మూల్యాంకన హాల్, రికార్డు నిర్వహణ, భద్రత ఏర్పాట్లు సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితంచేసే ఈ మూల్యాంకనంలో నిస్పక్షపాతంగా, తప్పులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట డీఈవో భోజన్న, సిబ్బంది ఉన్నారు.


