సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం | Masaipet Sarpanch Durgam Laharika Passes Away in Tragic Circumstances | Sakshi
Sakshi News home page

సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం

Apr 3 2026 5:53 PM | Updated on Apr 3 2026 6:41 PM

Masaipet Sarpanch Durgam Laharika Passes Away in Tragic Circumstances

సాక్షి,నిర్మల్‌: విధి ఆడిన వింత నాటకంలో సర్పంచ్‌ లహరిక మృతి చెందారు. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్‌ లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. లహరికను తీసుకెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.ప్రమాదంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లహరికను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

ఈ విధంగా వరుస సంఘటనలు విషాదాంతానికి దారితీశాయి. ఆత్మహత్య ప్రయత్నం, రోడ్డు ప్రమాదం, ఆసుపత్రి చికిత్స.. వరుస సంఘటనలు చివరికి విషాదాంతానికి దారితీశాయి. మాసాయిపేట సర్పంచ్‌ లహరిక మృతి నిర్మల్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది


 

Advertisement
 
Advertisement
Advertisement