కుష్ఠు రహిత సమాజానికి కృషి చేద్దాం
నిర్మల్‌చైన్‌గేట్: కుష్టు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సులో మాట్లాడారు. స్పర్శ లేని తెలుపు, ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చికిత్స పొందడం ద్వారా నివారణ సాధ్యమవుతుందన్నారు. లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరవన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుపై వివక్ష చూపొద్దన్నారు. అనంతరం వ్యాధి నివారణలో భాగస్వామవుతామని విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కవిత, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి బి.రవీందర్, డీపీఎంవోలు రాజేశ్వర్, గంగన్న, ఫిజియోథెరపిస్ట్ కిషన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ వీణ, అధ్యాపకులు పాల్గొన్నారు.


