బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేత
నిర్మల్: బీజేపీ సీనియర్‌నేత, హ్యాట్రిక్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన అయ్యన్నగారి రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈమేరకు ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా వేసుకున్నారు. కొంతకాలంగా బీజేపీ నుంచి రాజేందర్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. సొంత పార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలుస్తోంది. బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్ సమక్షంలో అయ్యన్నగారి రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు.


