సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవా రం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ము న్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ప రిశీలించి పోలీసులు అధికారులు, సిబ్బందికి పలు సూ చనలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికే డ్లు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి భద్రతా చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదుర్కొ న్నా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్‌శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు సుజాత, సుందర్‌సింగ్, రమాకాంత్, అజయ్, సమ్మయ్య, శ్రీపాల్. రాహుల్ గైక్వాడ్, సిబ్బంది ఉన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నిర్మల్ టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్లు నైలు, కృష్ణ, సమ్మయ్య, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


