నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jan 29 2026 6:07 AM | Updated on Jan 29 2026 6:07 AM

నిర్మ

నిర్మల్‌

గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ బోణీ కొట్టని నిర్మల్‌ మున్సిపాలిటీ ఖరారు కాని అభ్యర్థుల జాబితా నేతల ఇళ్ల చుట్టూ ఆశావహులు సమయం లేదంటూ ఆందోళనలు

జాతరెళ్తున్నారా.. జాగ్రత్తా..

సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షకు

సన్నద్ధం చేయాలి

నిర్మల్‌ రూరల్‌: ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షకు మూడో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో భోజన్న సూ చించారు. బుధవారం మండలంలోని రత్నాపూర్‌ కాండ్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్జీటీ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు తొలిమెట్టు అత్యంత కీలకమని, వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. అంతకుముందు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదోతరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి ఆరా తీశారు. ఎస్వో నర్సయ్య, ఎంఈవో వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు విజయస్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిర్మల్‌: ‘అరె.. ఏమన్నా ఇదేం టెన్షనే..!? నామినేషన్లకు ఒకరోజు గడిచిపోయే. మన పేర్లు ఇంకెప్పుడు ఫైనల్‌ చేస్తరు..!? మనకు ఏదో ఒకటి చెబితే.. మనం ఈడ ఉండుడా లేక వేరే పార్టీలకు పోవుడా తెలుస్తది కదా..!?’ ఇది నిర్మల్‌ మున్సిపల్‌లో ప్రధాన పార్టీ నుంచి బీఫామ్‌ కోసం పోటీపడుతున్న ఓ ఆశావహుడి ఆందోళన. ఈ ఒక్క నాయకుడిదే కాదు.. జిల్లాలోని మూ డు మున్సిపాలిటీల్లో ఇదే కథ. మూడు ప్ర ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, అలాగే ఎంఐఎం బుధవారం రాత్రి వరకూ తమ అభ్యర్థులెవరో ప్రకటించలేదు. నామి నేషన్ల పర్వం ప్రారంభమై ఒకరోజు గడిచిపోయి, మరో రెండురోజులే గడువున్నా.. ఇలా వివిధ రాజ కీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అటు ఆశావహులు, ఇటు గల్లీల్లో క్యాడర్‌ అ యోమయంలో ఉన్నారు. ఒక్కోవార్డులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ టికెట్ల కోసం ముగ్గురు, నలు గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరు గెలుపుగుర్రాలనేది ఆరా తీసి బుధవారం వరకు పార్టీలు ఇద్దరు చొప్పున పేర్లు తీసుకున్నాయి. ఇక అందులో బరిలో ఎవరు నిలుస్తారు, బీఫామ్‌ ఎవరికిస్తామనేది గురువారం తేలుస్తామని చెబుతున్నాయి.

అన్ని పార్టీలూ అంతే..

జిల్లాలో ఈసారి మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో నిర్మల్‌, ఖానా పూర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, భైంసాలో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటాపోటీ నడిచింది. ఈసారి ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పరిస్థితి ఉంది. బీజేపీ బా గా పుంజుకోవడం, బీఆర్‌ఎస్‌ కాస్త వెనుకంజలో ఉండటం, కాంగ్రెస్‌ అధికార పార్టీగా మారడం, ఎంఐఎం తన ఓటుబ్యాంక్‌ పదిలం చేసుకోవడంతో పు రపోరు ఎలా ఉండబోతోందనే విషయాన్ని పక్కాగా తేల్చలేకపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీల సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇక పార్టీలు ఎదుటివాళ్లు టికెట్లు ఇచ్చిన తర్వాత పరిస్థితిని, అభ్యర్థులను బట్టి తమ జాబితాను ప్రకటిద్దామనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. నామినేషన్ల గడువులో ఒకరోజు గడిచినా.. జాబితా ప్రకటించలేదని చెబుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు గురువారం మధ్యాహ్నంలోపు తమ అభ్యర్థుల ఫైనల్‌ జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఆశావహుల్లో ఆందోళన

దాదాపు రెండునెలలుగా గల్లీలో పనులు చేస్తూ, ప్ర జలతో మమేకమవుతూ వస్తున్న లీడర్లంతా ఇప్పు డు పార్టీ టికెట్‌ కోసం అపసోపాలు పడుతున్నారు. నిర్మల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో వార్డులో నలుగురైదుగురూ పో టీపడుతున్నారు. ఇందులో ఎవరికివ్వాలనేది తేల్చ డం పార్టీ నాయకులకూ అంతుపట్టడం లేదు. చైర్మ న్‌ స్థానం ఆశిస్తున్న నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతకాలంగా నిర్మల్‌లో బీజేపీ నుంచి చైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తున్న సీనియర్‌నేత, హ్యాట్రిక్‌ కౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌ సొంతపార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బుధవారం రాత్రి బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్‌ అనిల్‌ సమక్షంలో హైదరాబాద్‌లో గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారు కూడా ఇక్కడ రాకపోతే బీఆర్‌ఎస్‌ నుంచైనా బరిలో నిలువాలన్న యోచనలో ఉన్నారు.

నిర్మల్‌లో నిల్‌

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు స్పందన నామమాత్రంగానే ఉంది. మూడు మున్సిపాలిటీల్లో కలిపి బుధవారం ఐదు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఖానాపూర్‌లో 7, 9, 11 వార్డులకు ఒక్కటి చొప్పున, భైంసాలో 9, 14వార్డులకు ఒక్కో నామినేషన్‌ చొప్పున వేశారు. జిలాకేంద్రమైన నిర్మల్‌లో 42 వార్డులుండగా తొలిరోజు ఒక్కటంటే ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. షెడ్యూల్‌ ప్రకటించిన మరుసటి రోజునే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం, మరోవైపు పార్టీలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఎవరూ నామినేషన్‌ వేసేందుకు ముందుకు రాలేదు. చాలామంది బుధవారం మున్సిపాలిటీల్లో పన్నులు చెల్లించారు. రెవెన్యూ నుంచి ధ్రువపత్రాలు తీసుకోవడంలోనే బిజీగా కనిపించారు. మున్సిపాలిటీకి కూడా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పన్నులు ఇలా ఎన్నికల పుణ్యాన కొంతమేరకై నా క్లియర్‌ అవుతున్నాయి. ఇక గురువారం ఉదయమే అభ్యర్థిత్వాలు ఖరారైతేనే నామినేషన్లు వేయడానికి రెండురోజుల గడువు ఉంటుంది. మరోరోజు ఆలస్యం చేసినా చివరిరోజే ఆగమేఘాల మీద నామినేషన్‌ వేయాల్సి వస్తుందని ఆశావహులు వాపోతున్నారు.

నిర్మల్‌1
1/3

నిర్మల్‌

నిర్మల్‌2
2/3

నిర్మల్‌

నిర్మల్‌3
3/3

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement