నాగోబాకు మొక్కులు
ఇంద్రవెల్లి:ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కా వడంతో ఆలయం జనసంద్రమైంది. దర్శనం కో సం బారులు తీరారు. అనంతరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమి షన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక పూజలు అ నంతరం దర్శించుకున్నారు. మెస్రం వంశీయులు ఆయన్ను శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, రాంబాబు నాయక్, శంకర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అధికారులు సునీత, అంబాజీ, నర్సింగ్, నారాయణరెడ్డి, సర్పంచ్ తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావు ఉన్నారు.


