జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి ఎల్.లక్ష్మణ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తాచాటాడు. పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జరుగుతున్న ఈ పోటీల్లో రజత పతకంతో మెరిశాడు. – 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. రాష్ట్రానికి జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో జూడోలో వచ్చిన మొట్టమొదటి రజత పతకం అందుకోవడం విశేషం. సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, డీటీఎస్‌ఓ పార్థసారథి, కోచ్ రాజు అతన్ని అభినందించారు.


