● రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● ఫలితాలపై ఆందోళనలో అభ్యర్థులు ● గతానికి భిన్నంగా పోలింగ్‌ సరళి | - | Sakshi
Sakshi News home page

● రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● ఫలితాలపై ఆందోళనలో అభ్యర్థులు ● గతానికి భిన్నంగా పోలింగ్‌ సరళి

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

● రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసి

● రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసి

● రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● ఫలితాలపై ఆందోళనలో అభ్యర్థులు ● గతానికి భిన్నంగా పోలింగ్‌ సరళి

నిర్మల్‌: ఎన్నికలు పూర్తయిన ఒక్కరోజు తేడాలోనే మున్సిపల్‌ ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిప ల్‌ ఎన్నికల ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చేపట్టనున్నారు. ఈమేరకు మూడు వేర్వేరు కేంద్రాలు, కౌంటర్లు, టేబుళ్లు ఏర్పాటు చే శారు. వీటిని బుధవారం ఉదయం కలెక్టర్‌, ఎస్పీ, సంబంధిత అధికారులు పరిశీలించి సూచనలు చేశా రు. బందోబస్తు మధ్య కౌంటింగ్‌ చేపట్టనున్నారు.

అభ్యర్థుల్లో టెన్షన్‌..

పోలింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య ఒక్కరోజే తేడా ఉంది. కానీ.. ఈ 24గంటలు కూడా ఈసారి అభ్యర్థులను ఆందోళన పెట్టిస్తున్నాయి. ప్రధానంగా నిర్మల్‌ మున్సిపాలిటీలో గతానికి భిన్నంగా పోలింగ్‌ సరళి సాగింది. మొత్తం 42వార్డుల్లో చాలాచోట్ల కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. కొన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు గట్టిపోటీ ఇచ్చాయి. ఒకట్రెండు చోట్ల బీఎస్పీ, స్వతంత్రులూ బలంగా కనిపించారు. భైంసాలో ఎంఐఎం, బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా పోటాపోటీగా నిలిచింది. బీజేపీ రెబల్స్‌గా నిలిచిన స్వతంత్రులు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూడు ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం చెప్పడం కష్టంగా మారింది.

హలో.. మీదగ్గర ఏం పరిస్థితి?

మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమైన గంట నుంచే పోలింగ్‌ సరళిపై పలువురు ఆరాతీయడం ఆరంభమైంది. ‘హలో మీవార్డులో ఏం పరిస్థితి. ఎవరు బ యటపడతరు..’ అంటూ గంటకోసారి ఫోన్లు చేయ డం కనిపించింది. విదేశాలు, దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులూ మున్సిపల్‌ ఎన్నికలపై ఎప్పటికప్పుడు ఆరాతీశారు. ఎన్నికలు ముగిసిన నుంచి ఎక్కడికక్కడ అభ్యర్థులు, అనుచరులు, పార్టీల నేతలు వార్డుల వారీగా లెక్కలు వేయడం కనిపించింది. ఎక్కడెక్కడ గెలుస్తున్నాం.. ఎక్కడ వెనుకబడ్డాం.. అని ముందస్తుగా ఓ అంచనా వేసుకుంటున్నారు. బ్యాలెట్‌బాక్సుల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలిపోనుంది.

పకడ్బందీగా ఓట్లు లెక్కించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ఈ నెల 13న నిర్వహించను న్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికా రులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి తనిఖీ చేశారు. నిర్మ ల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల వా రీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ టేబుళ్లు, అ భ్యర్థుల గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు టీ, టిఫిన్‌, భోజనం, తాగునీటి వసతులు కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఏఎస్పీ సాయికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement