ఓటెత్తిన పట్టణం | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన పట్టణం

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

ఓటెత్

ఓటెత్తిన పట్టణం

● 65.60 శాతం పోలింగ్‌ నమోదు ● ఉత్కంఠగా సాగిన ‘పుర’సమరం ● ప్రశాంతంగా ఓటేసిన సిటీజనం ● మూడు పట్టణాల్లో ఓట్ల పండుగ ● బ్యాలెట్‌ బాక్సుల్లో భవిత నిక్షిప్తం ● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కాలేజీ బూత్‌ వద్ద తొలిసారి ఓటేసిన విద్యార్థిని సన్మానిస్తున్న కలెక్టర్‌

జిల్లా కేంద్రంలో ఓటు వేసి సిరా చుక్క చూపుతున్న మహిళలు

పోలింగ్‌కు పకడ్బందీ బందోబస్తు

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానా పూర్‌ మున్సిపాలిటీల్లోని 80వార్డులకు బుధవా రం ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 244 పోలింగ్‌ కేంద్రాల వద్ద సుమారు వెయ్యి మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో ఎస్పీ జానకీ షర్మిల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, 37 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సా రించారు. ఎన్నికల నేపథ్యంలో సీఆర్పీసీ 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎస్పీ జానకీ షర్మిల స్వ యంగా మూడు మున్సిపాలిటీల్లోని పలు పో లింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనే ఉంటుందని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిర్మల్‌, భైంసాలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్‌

నిర్మల్‌: నిర్మల్‌ మున్సిపాలిటీ నిధానంగా ఓటేసింది. భైంసా బల్దియా పొద్దున్నుంచే బారులుదీరింది. ఖానా‘పురం’ ప్రశాంతంగా పోలింగ్‌ ముగించింది. మూడుచోట్ల కలిపి 65.60 పోలింగ్‌శాతం నమోదైంది. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటర్లు నిధానంగా ఓటేశారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్‌ కలెక్టర్లు ఫైజాన్‌అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకుడు వీరా రెడ్డి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌కేంద్రాలను పర్యవేక్షించారు. తొలిఓటర్లు, సీనియర్‌ సిటిజన్‌లూ హుషారుగా ఓటేయ డం కనిపించింది. రోడ్లన్నీ సందడిగా మారగా మూ డు పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపించింది.

పొద్దున్నుంచే ప్రారంభం

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో కలిపి 80వార్డులకు గాను 244పోలింగ్‌ కేంద్రాలు ఏర్పా టు చేశారు. గంటముందే మరోసారి అంతా సరిచూసుకున్న పోలింగ్‌ సిబ్బంది ఉదయం 7గంటల నుంచి ఓటర్లను లోపలికి అనుమతించారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో అన్నిపార్టీలు టెంట్లు వేసుకుని కూర్చున్నాయి. ఓటర్లకు స్లిప్‌లు రాసివ్వడంతో పా టు తమ పార్టీకి ఓటేయండంటూ చివరిసారి బతి మాలడం కనిపించింది. మొదటి రెండుగంటల పా టు ఓటర్లు నిధానంగా కేంద్రాలకు వచ్చారు. దీంతో నిర్మల్‌లో చాలా కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. ఉదయం 9గంటల వరకు భైంసా, ఖానాపూర్‌లో పోలింగ్‌ 10శాతం దాటగా, నిర్మల్‌లో 6శాతమే నమోదైంది. ఆ తర్వాత నుంచి జిల్లాకేంద్రంలోనూ క్రమంగా ఓటింగ్‌ పెరుగుతూ వచ్చింది.

గతం కంటే తక్కువే..

పట్టణవాసి ఈసారి కూడా ఓటేయడంలో సోమరితనాన్ని ప్రదర్శించాడు. తమకంటే పల్లెఓటర్లే నయం అనిపించాడు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ 2020లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి తక్కువ పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. అప్పుడే కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలో తొలిసారే 76.12శాతం నమోదుకాగా, ఇప్పుడు కాస్త తగ్గి 74.83శాతం నమోదైంది. భైంసాలో గత ఎన్నికల్లో 64.70శాతం ఓటింగ్‌ కాగా, ఇక్కడా రెండుశాతం తగ్గింది. ఈసారి 62.67శాతం ఓటేశారు. నిర్మల్‌ బల్దియాలో ఆరేళ్లక్రితం 65.31శాతం పోలింగ్‌ కాగా, తాజా ఎన్నికల్లో 65.47 ఓటింగ్‌శాతం నమోదైంది. ఒక్క నిర్మల్‌లో మాత్రమే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లే ఈసారీ వచ్చాయి.

చాలాచోట్ల ఓటర్ల ఆందోళన

‘నా ఓటు వేరేవారు వేశారు..’ అంటూ ఈసారి ము న్సిపల్‌ ఎన్నికల్లో చాలాచోట్ల ఓటర్లు ఆందోళన వ్య క్తంచేశారు. భైంసా, నిర్మల్‌లోని పలువార్డుల్లో ఇలా దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాకేంద్రంలోని బుధవార్‌పేట్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏ జెంట్లను మారుస్తున్నారంటూ పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో గల పోలింగ్‌ కేంద్రాన్ని మోడల్‌ కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇక్కడ సీనియర్‌ ఓటర్లతోపాటు తొలి ఓటర్లను కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, అధికారులు శాలువాలతో సన్మానించారు. సెల్ఫీ పాయింట్‌వద్ద వారితో ఫొటోలు దిగారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్‌ సిబ్బంది స్వయంగా లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించారు. ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో పోలీస్‌శాఖ పకడ్బందీగా వ్యవహరించింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు చోటివ్వలేదు. సెల్‌ఫోన్‌లను కేంద్రాల్లోకి అనుమతించలేదు.

ఎవరు గెలుస్తరంటవ్‌..?

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

పోలైన ఓట్ల వివరాలు..

మున్సిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్‌

ఓట్లు ఓట్లు శాతం

నిర్మల్‌ 98,204 64,295 65.47

భైంసా 51,118 32,035 62.67

ఖానాపూర్‌ 17,693 13,240 74.83

మొత్తం 1,67,015 1,09,570 65.60

బ్యాలెట్‌బాక్సుల్లో అభ్యర్థుల భవిత

మున్సిపాటీల వారీగా పోలింగ్‌ సరళి

సమయం నిర్మల్‌ భైంసా ఖానాపూర్‌

6.89 11.91 9.83

15.73 27.12 23.65

33.73 43.53 42.81

51.12 51.80 59.64

57.83 61.63 72.62

65.47 62.67 74.83

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 80వార్డులుండగా కాంగ్రెస్‌ నుంచి 78మంది, బీజేపీ నుంచి 66, బీఆర్‌ఎస్‌ నుంచి 63, ఎంఐఎం నుంచి 39, ఇతరులంతా కలిపి 107మంది పోటీచేశారు. మొత్తం 353మంది ఈసారి ఎన్నికల్లో తలపడ్డారు. పోటాపోటీగా ప్రచారం చేసిన వీరంతా గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. పోలింగ్‌ రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కేంద్రాల వద్ద ఉంటూ ఓటర్లను చివరి నిమిషంలోనూ ఓటేయాలంటూ కోరారు. పోలింగ్‌ సిబ్బంది సాయంత్రం 5గంటలలోపు కేంద్రాల్లో ఉన్న ఓటర్లతో ఓట్లు వేయించారు. బ్యాలెట్‌బాక్సులను సాయంత్రం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేర్చారు. అక్కడి నుంచి అభ్యర్థుల భవిత ఉన్న బ్యాలెట్‌బాక్సులను మూడంచెల భద్రత వ్యవస్థ ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌లలో జాగ్రత్తగా భద్రపర్చారు.

పోలింగ్‌ ముగిసేవరకు

ఓటెత్తిన పట్టణం1
1/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం2
2/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం3
3/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం4
4/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం5
5/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం6
6/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం7
7/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం8
8/9

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం9
9/9

ఓటెత్తిన పట్టణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement