పురవాసి.. మార్చుకో ఓటేసి.. | - | Sakshi
Sakshi News home page

పురవాసి.. మార్చుకో ఓటేసి..

Feb 11 2026 8:42 AM | Updated on Feb 11 2026 8:42 AM

పురవా

పురవాసి.. మార్చుకో ఓటేసి..

బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

మొన్నటి పల్లె ఓటరే ఆదర్శం పట్టణం పేరూ నిలబెట్టాలి సిటీజనం 80వార్డులు, 244 పోలింగ్‌ కేంద్రాలు మొత్తం పుర ఓటర్లు : 1,69,015 పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి ఉదయం 7నుంచి సాయంత్రం 5 వరకు మూడు మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు

నిర్మల్‌

సీఎం కప్‌ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

సారంగపూర్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జిల్లాస్థా యి సీఎం కప్‌పోటీల్లో జామ్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతి భ కనబర్చారు. జావలిన్‌త్రో, కిక్‌బాక్సింగ్‌లో పాఠశాలకు చెందిన ముగ్గురు బాలికలు బంగా రు పతకాలు సాధించారు. క్యారమ్‌, కిక్‌బాక్సింగ్‌, కబడ్డీ, ఖోఖో పోటీల్లో వెండి పతకాలు గెలిచారు. 17 మంది విద్యార్థినులు జావలిన్‌త్రో, కిక్‌బాక్సింగ్‌, ఆత్యపాత్య, బాల్‌ బ్యాడ్మింటన్‌, హ్యాండ్‌బాల్‌ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ సంగీత, పీఈటీ సుష్మిత, పీడీ సుప్రియ అభినందించారు.

నిర్మల్‌: ఏడాదిగా పట్టణవాసులు ఎదురుచూస్తున్న సందర్భం రానేవచ్చింది. పుర పోరకు సమయం ఆసన్నమైంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బుధవారం మున్సిపల్‌ పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బరిలో ఉన్న అభ్యర్థుల తలరాతతోపాటు, పుర ఓటర్లు తమ పట్టణ భవితవ్యం తేల్చుకునేందుకు పోలింగ్‌కేంద్రాలకు ఓ(పో)టెత్తాల్సిందే. గత ఎన్నికల పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే పట్టణ ఓటర్లలో చాలామంది ఓటేయడమంటేనే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లే చాలానయం. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లే అధికంగా ఓటేశారు. తమకు అన్నీ తెలుసని చెప్పుకునే పట్టణ ఓటరు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈసారి మాత్రం అలా ఉండకూడదని, ఇప్పుడైనా పురజనం కదలాలని కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా అధికారులు పిలుపునిచ్చారు.

మున్సి‘పోల్స్‌’కు సర్వం సిద్ధం..

నిర్మల్‌ మున్సిపాలిటీలోని 42 వార్డులు, భైంసా 26, ఖానాపూర్‌లోని 12 వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీస్టేడియం, భైంసా, ఖానాపూర్‌లో స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ/స్వీకరణ కేంద్రాల నుంచి మంగళవారం పోలింగ్‌ సిబ్బంది ద్వారా ఎన్నికల సామగ్రిని పంపించారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సాయంత్రం వరకు చేరుకుని, పోలింగ్‌ కోసం ముందే ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌లు, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించారు.

ఉదయం 7 గంటల నుంచే..

మూడు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నవారు ఓటేసే వరకు సమయం ఇవ్వనున్నారు. నిర్మల్‌లో 98,204 మంది ఓటర్లకు, 145 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భైంసాలో 53,118 మంది ఓటర్లకు 74 కేంద్రాలు, ఖానాపూర్‌లో 17,693 మంది ఓటర్లకు 25 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,69,015 మంది ఓటర్లకు 244 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణను పోలింగ్‌ సిబ్బందితోపాటు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సున్నిత కేంద్రాలతోపాటు దాదాపు అన్ని పోలింగ్‌కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మపరిశీలకులుగా నియమించారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అతి సున్నిత, సున్నిత ప్రాంతాల్లో అదనంగా పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు.

పోలింగ్‌ కేంద్రాల వివరాలు..

వివరాలు ఖానాపూర్‌ నిర్మల్‌ భైంసా మొత్తం

వార్డులు 12 42 26 80

పోలింగ్‌ కేంద్రాలు 25 145 74 244

అతిసున్నిత కేంద్రాలు 15 59 33 107

సున్నిత కేంద్రాలు 10 86 41 137

పోలింగ్‌ ప్రాంతాలు 07 52 26 85

పోలింగ్‌ రూట్లు 02 17 09 28

ఎఫ్‌ఎస్‌టీ బృందాలు 02 10 05 17

ఎస్‌ఎస్‌టీ బృందాలు 10 13 13 36

పోలింగ్‌ సిబ్బంది వివరాలు..

మున్సిపాలిటీ పోలింగ్‌ ఒక్కో కేంద్రంలో పీఓలు ఏపీఓలు ఓపీఓలు

కేంద్రాలు ఓటర్లు

నిర్మల్‌ 145 599–792 145 145 435

భైంసా 74 519–860 74 74 222

ఖానాపూర్‌ 25 581–800 25 25 75

మొత్తం 244 244 244 732

మున్సిపాలిటీలు, వార్డులు, ఓటర్ల వివరాలు..

మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం

నిర్మల్‌ 42 50,824 47,362 18 98,204

భైంసా 26 25,623 25,486 09 53,118

ఖానాపూర్‌ 12 9,169 8,524 00 17,693

బాధ్యతగా ఓటేద్దాం..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రజలందరూ సహకరించాలి. ఓటువేయడం బాధ్యతగా భావించాలి. పోలింగ్‌ డే అంటే సెలవుదినంగా భావించొద్దు. మీరు వేయడమే కాకుండా మిగతా వారితోనూ ఓటు వేయించాలి. ఈసారి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో వందశాతం పోలింగ్‌ నమోదయ్యేలా చూడాలి.

– అభిలాషఅభినవ్‌, కలెక్టర్‌

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 1
1/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 2
2/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 3
3/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 4
4/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 5
5/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 6
6/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 7
7/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

పురవాసి.. మార్చుకో ఓటేసి.. 8
8/8

పురవాసి.. మార్చుకో ఓటేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement