పటిష్ట బందోబస్తు
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.
నిర్మల్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
244 పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లో మొత్తం 80 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కోసం 244 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 48 సమస్యాత్మక, 37 అతి సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. వీటిని సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు నిరంతర పర్యవేక్షిస్తాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరుకు 44 సెక్షన్ అమలులో ఉంటుంది. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్లు, రహదారులు 24/7 కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలన ఉంటుంది.
అప్రమత్తంగా విధులు..
పోలీస్‌లు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటువేసేలా భద్రత కల్పించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. – జానకీషర్మిల, ఎస్పీ
శాంతియుత ఎన్నికలకు చర్యలు
భైంసాటౌన్: భైంసా పట్టణంలోని మున్సి పల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న ట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భైంసా సబ్ డివిజన్ పోలీ సు అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ సందర్భంగా 500 మంది పోలీసుల బలగాలతో బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మొద్దని, పేర్కొన్నారు. ప్రశాంత పోలింగ్‌కు అంద రూ సహకరించాలని సూచించారు. అనంతరం పోలీసు బలగాలతో పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఆమె వెంట ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐలు సాయికుమార్, ప్రవీణ్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, శివంగి బృందం సభ్యులు ఉన్నారు.


