ఖానాపూర్‌లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్మల్ అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు, పార్టీలు సహకరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు. కండువాలు కప్పుకుని ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు నిషేధమని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఫ్లాగ్‌మార్చ్‌లో సీఐ అజయ్‌కుమార్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


