బీజేపీ, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
ఖానాపూర్: పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బీఆర్‌ఎస్‌తోపాటు, ఉపాధి హామీ పథకాన్ని ఖానాపూర్‌కు తెస్తామని తప్పుడు హామీలు ఇస్తున్న బీజేపీకి ము న్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డు ఏకలవ్య నగర్‌లో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంపల్లి రమేశ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్నాథ్‌రావు చౌరస్తా నుంచి ఇందిరానగర్‌వరకు త్వరలో 66 రోడ్డు విస్తరణ చేస్తామన్నారు.


