వృక్షశాస్త్రంలో..
వృక్షశాస్త్రంలో 30 మార్కులు సాధించా లంటే విద్యార్థులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చదవాలని మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్రం అధ్యాపకుడు పురుషోత్తం అంటున్నారు. ప్రధానంగా ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న వృక్ష వర్గీకరణ శాస్త్రంకు సంబంధించి 3 కుటుంబాలపై అడుగుతారు. ఇందులో మొక్క శాఖీయ లక్షణాలతోపాటు, పుష్ఫ లక్షణాలు రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్న కాండం అడ్డుకోతపై ఉంటుంది. దీనికి 6 మార్కులు ఇచ్చినది సెక్షన్ తీసి దాని గుర్తింపు లక్షణాలు రాయాలి. మూడోది వృక్ష శరీరధర్మ శాస్త్రంరం ప్రయోగాల నుంచి వస్తుంది. దీనికి 6 మార్కులు ప్రయోగం ఉద్దేశం, సూత్రం, పరిశీలన, అనుమితి రాయాలి. స్లైడ్స్, స్ఫెసిమెన్స్‌లకు 5 మార్కులు, ఇక మిగిలిన 7 మార్కులలో 2 మార్కులు హెర్బేరియం, 5 మార్కులు రికార్డుకు ఉంటాయి. మన దైనిందిన జీవితంలో ఉండే మొక్కలు సేకరించాలి. పటాలు వేయడం, పుష్ప సంకేతంపై దృష్టి సారిస్తే 30 మార్కులు పొందడం సులభం.


