సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు షురూ..
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని వాసవీ వరల్డ్ స్కూల్ సమీపంలోని క్రీడా మైదానంలో శనివారం జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వాలీబాల్, ఫుట్‌బాల్, చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, నెట్‌బాల్, సిమ్మింగ్, హాకీ, స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేందర్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ నిమ్మల శ్రీధర్‌రెడ్డి, ఎల్లంపల్లి సర్పంచ్ భీమ్‌రావు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


