ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసిందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. 1వ వార్డు నుంచి గొర్రె తిరుమల, 2వ వార్డు ద్యావతి రాజేశ్వర్, 3వ వార్డు జన్నారపు విజయలక్ష్మి, 4వ వార్డు కస్తూ రి మహేశ్, 5వ వార్డు నేత పవిత్ర, 6వ వార్డు అఫ్రీన్‌బేగం, 7వ వార్డు పోలంపెల్లి రమేశ్, 8వ వార్డు అస్మాత్ జాహన్‌షౌకత్‌పాషా, 9వ వార్డు చింతపండు రవి, 10వ వార్డు తొంటి రాధ, 11వ వార్డు చిన్నం సత్యం, 12వ వార్డు లావుడ్య లాలు పోటీ చేస్తున్నట్లు వివరించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని, ఆమేరకే అభ్యర్థులను బరిలో దించాయని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆరోపించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. పట్టణంలో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను పునఃప్రారంభించామని తెలిపా రు. విపక్షాల తప్పుడు మాటలు నమ్మొద్దని కోరా రు. ఖానాపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. దయానంద్, మజీద్, అంకం రాజేందర్, యూసఫ్‌ఖాన్, జంగిల్ శంకర్, కుత్‌బొద్దీన్, శేషాద్రి, రాము, శెట్టి శ్యామ్, శ్రీహరి, మణికంఠ, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


