మున్సిపల్ కార్యాలయం తరలించొద్దు
ఖానాపూర్: పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని తరలించొద్దని హన్మాన్‌మందిర్ కాలనీవాసులు కోరారు. కాలనీలోని పాఠశాలలోఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కాలనీలో అభివృద్ధిలో వెనుకబడిందని, భూములు, ప్లాట్ల ధరలు పడిపోయాయన్నారు. ఉన్న కార్యాలయాన్ని తరలిస్తే కాలనీ అభివృద్ధిలో మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని రోడ్డుపై లీకేజీలను నిర్మూలించలేని నాయకులు కాలనీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో ఆయిందాల జనార్దన్, నాయిని శంకర్, నాయిని రాజేశ్వర్, బిల్ల రాజేశ్వర్, కరిపె రాజశేఖర్, నాగరాజు, నిమ్మల సాయి, ఎలిశెట్టి మహేశ్, గోపాల్, ప్రణీత్, ప్రవీణ్, మహేశ్, భూమరాజు తదితరులు పాల్గొన్నారు.


