గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటే ల్ అధ్యక్షతన శనివారం నిర్మల్‌లో నిర్వహించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, ముధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బోస్లే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


