వన్యప్రాణుల గణన పకడ్బందీగా నిర్వహించాలి
మామడ: వన్య ప్రాణులు, వృక్ష సంపద గణన పకడ్బందీగా చేపట్టాలని బాసర సర్కిల్ సీసీఎ ఫ్ అధికారి శరవణన్ అన్నారు. మండలంలోని నల్దుర్తి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గణన ను శనివారం పరిశీలించారు. మాంసాహార, శా కాహార, వృక్ష సంపద వివరాలను అటవీ సి బ్బంది నమోదు చేస్తున్నారు. చిరుతపులి, ఎలు గుబంటి, అడవి కుక్కలు, నక్కలు వంటి జంతువుల పాదముద్రల ఆధారంగా లెక్కిస్తున్నా రు. అటవీ జంతువుల వేట, చెట్ల నరికివేతను నిరోధించాలని, అటవీ ప్రాంతంలో అగ్ని ప్ర మాదాలు జరగకుండా చూడాలని సూచించా రు. సీపీఎఫ్ వెంట ఎఫ్‌డీవో నాగినిభాను, ఎఫ్ ఆర్వో శ్రీనివాస్‌రావు, ఎస్‌ఎస్‌వో శ్రీనివాస్, ఎఫ్‌బీవో అంజయ్య, రాజు ఉన్నారు.


