నిర్మల్
న్యూస్‌రీల్
జిల్లాలో కొనసా..గుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు.. లబ్ధిదారులపై అదనపు భారం ఏడాదిలో నిర్మించినవి 28 మాత్రమే
నా దేశం నా ఓటు
ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. పాలించేవారిని ఎన్నుకోవడానికి వాడే గొప్ప వజ్రాయుధం. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం..
వంద శాతం ఫలితాలు సాధించాలి
లక్ష్మణచాంద: విద్యార్ధులు వంద శాతం ఫలితాలు సాధించేలాగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాధ్ జిల్లా ఎంజేపీ ఆర్సీవో శ్రీధర్ అన్నారు. మండలంలోని రాచాపూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. కిచెన్‌లోకి వెళ్లి వంట సరుకులను, తయారు చేసిన వంటను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రణాళికతో చదవాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడాన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. ప్రయోగ పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్ష చొప్పున మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొదటి విడతలో జిల్లాలోని 18 మండలాల్లో 9,172 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరు చేసి ఏడాదైనా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 28 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల్లో చాలా మంది నిర్మాణం మొదలు పెట్టలేదు. దీంతో సుమారు 1,431 మంది ఇళ్లను రద్దు చేశారు.
నిబంధనలతో అనాసక్తి..
ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో పురోగతి కనిపించడంలేదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా అధికారులు విభజించారు. ఒక్కో ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లించనున్నది. ఈ నిబంధనలతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. మొదట మండలానికి ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లోనూ నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. తర్వాత మంజూరైన ఇళ్ల నిర్మాణంలోనూ జాప్యం జరుగుతోంది.
కూలీలకు ఫుల్ డిమాండ్..
గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1200 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది.
జిల్లాలోని ఓ గ్రామంలో పునాది దశలోనే ఉన్న ఇందిరమ్మ ఇల్లు
మండుతున్న ధరలు..
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..
మొత్తం మంజూరు 9,172
ప్రొసీడింగ్ పొందినవారు 7,741
మార్కౌట్ అయినవి 6,355
బేస్మెంట్ అయినవి 4,631
గోడలు పూర్తయినవి 2,485
స్లాబు పూర్తయినవి 1,536
ఇంటి నిర్మాణం పూర్తి 28
ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి బస్తా రూ.50 నుంచి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారు సిమెంటు కోసమే అదనంగా రూ.33 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సిఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ.6 వేలు ఉండగా ప్రస్తుతం రూ.9,500 పలుకుతోంది. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్‌కు అవసరమయ్యే 20 ఎంఎం. కంకర ధర ట్రాక్టరుకు రూ.4,500 ఉండగా ప్రస్తుతం రూ.5,100 పలుకుతోంది.
నిర్మల్


