చరిత్రలో నిర్మల్ గమనం
‘మన ఊరు–మన వారసత్వం’ పేరిట సర్వే నిర్మల్ చరిత్రకు కల్చరల్ మ్యాపింగ్‌తో కొత్త ఊపిరి చారిత్రక విశేషాలను భద్రపరిచే దిశగా కేంద్రం అడుగులు కార్యాచరణ చేపట్టనున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు
నిర్మల్‌ఖిల్లా: గ్రామీణ భారతదేశంలోని అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర సాంస్కృక శాఖ నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘నా ఊరు – నా వారసత్వం(మేరా గావ్.. మేరీ ధరోహర్)’ పథకం గ్రామాల్లో సరికొత్త చరిత్ర అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. గ్రామాల చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను లిఖితపూర్వకంగా నమోదు చేయనున్నారు.
జిల్లా చారిత్రక ఖజానా
జిల్లాలోని 400 రెవెన్యూ గ్రామాలు, మూడు పట్టణాలు దస్తూరాబాద్ నుంచి బాసర సరస్వతీ నిలయం వరకు విస్తరించిన ప్రాంతంలో గోదావరి తీర నాగరికత, రాజుల పరాక్రమం, కోటలు, బురుజులు, జానపద కళలు, పండుగలు అపారం. మౌఖిక కథలు, యుద్ధగాధలు, గ్రామ దేవతలు, వ్యవసాయ ఆచారాలు సర్వేలో నమోదవుతాయి. చరిత్రకారులు, పరిశోధకులు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు.
చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి...
‘నిర్మల్ గడ్డపై ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఈ మ్యాపింగ్ ద్వారా మన జిల్లా వైభవం ప్రపంచానికి తెలియడమే కాకుండా, అంతరించిపోతున్న కళలు, చా రిత్రక అంశాలకు పునర్జీవం లభిస్తుంది. మరుగునపడిన చరిత్రను తెలసుకుంటే ఔరా అని పించకమానదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణ యం ఆహ్వానించదగినదే.. – కటకం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హిస్టరీ, నిర్మల్
సమష్టి భాగస్వామ్యం అవసరం...
ప్రభుత్వం చేపట్టే ఈ మహత్తర కార్యక్రామంలో చరిత్రకారులు, మేధావులు భాగస్వాములై మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిర్మల్ జిల్లాలోని అద్భుతమైన చరిత్రను ప్రపంచపటంపై ఉంచేందుకు ఈ ‘నా ఊరు – నా వారసత్వం’ ఒక సువర్ణావకాశం.
– ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడు, నిర్మల్
ఈ సర్వేలో ప్రధానంగా ఏడు అంశాలపై దష్టి సారించనున్నారు:
చారిత్రక నిదర్శనాలు
కళావృత్తులు
ఆధ్యాత్మిక కేంద్రాలు
వీరత్వ గాధలు
ఈ మ్యాపింగ్ గ్రామ చరిత్రను డిజిటల్‌గా భద్రపరచి, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. యువతలో మూలాల అవగాహన పెరుగుతుంది. నిర్మల్ ’కోటల నగరం’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతుంది. ఎంపీడీవోలు, గ్రామకార్యదర్శుల శిక్షణ తర్వాత సర్వే ప్రారంభిస్తారు.
మ్యాపింగ్‌లో కీలకాంశాలు:
చరిత్రలో నిర్మల్ గమనం
చరిత్రలో నిర్మల్ గమనం


