ప్రచార హోరు.. దావత్‌ల జోరు | - | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు.. దావత్‌ల జోరు

Feb 9 2026 8:08 AM | Updated on Feb 9 2026 8:08 AM

ప్రచార హోరు.. దావత్‌ల జోరు

ప్రచార హోరు.. దావత్‌ల జోరు

● మందు, విందులతో ఓటర్లకు గాలం ● పోటాపోటీగా అభ్యర్థుల ఖర్చు

నిర్మల్‌చైన్‌గేట్‌: మున్సిపల్‌ ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అభ్యర్థులు తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా, హామీలు ఇవ్వకుండా.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎవరికి ఎంత ఇవ్వాలి.. ఎవరెవరికి మందు, విందు ఏర్పాటు చేయాలని ఓటర్లను ఆకర్షించే ప్రలోభాలపై దృష్టి పెడుతున్నారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. దావత్‌లు ఇస్తున్నారు.

ఓటర్ల ప్రసన్నం కోసం..

పేద ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వార్డుల వారీగా బియ్యం, నూనె, పప్పు, చక్కెర వంటి పదార్థాలతో కూడిన కిట్లను నేరుగా ఓటర్ల ఇంటికి పంపుతున్నారు. ఇక చీకటి పడిన తర్వాత కాలనీల్లో ఇల్ల డాబాలపై దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపు కోసం ఖర్చులకు వెనుకాడడం లేదు.

మహిళలు, యువతపై ఫోకస్‌..

మహిళలు, యువత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపైనే అభ్యర్థులు ప్రధాన దృష్టి పెట్టారు. అభివృద్ధి హామీలకు బదులు ఈ వర్గాలను తక్షణం ప్రసన్నం చేసే పద్ధతులు అమలు చేస్తున్నారు. ‘ఓటు మనదే, అభ్యర్థి మనోడే‘ అనే నినాదంతో ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. సాయంత్ర సామూహిక విందులు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement