కుటుంబ కలహాలతో సర్పంచ్‌ ఆత్మహత్య | Tragic Incident in Nirmal District | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో సర్పంచ్‌ ఆత్మహత్య

Apr 4 2026 5:13 AM | Updated on Apr 4 2026 5:13 AM

Tragic Incident in Nirmal District

 పుట్టింటికి వెళ్లిన భార్యను గ్రామ సభ కోసం తీసుకువచ్చిన భర్త..

కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్‌ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్‌కు చెందిన లహరిక (31), మాసా యిపేటకు చెందిన ఆర్‌ఎంపీ రాజేశ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో గతేడాది డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్‌ కావడంతో రాజేశ్‌ లహరికను సర్పంచ్‌గా నిలబెట్టగా విజయం సాధించింది. అయితే వారి ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణ గలేదు.

దీంతో లహరిక ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇంతలో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలు నిర్వ హించాలని నిర్ణయించింది. దీంతో రాజేశ్‌ నర్సా పూర్‌కు వెళ్లి లహరికను ఈనెల 1న తీసుకు వచ్చా డు. గురువారం గ్రామ సభలో సర్పంచ్‌ లహరిక పాల్గొన్నారు. అయితే శుక్రవారం ఉద యం తన ఏడేళ్ల కొడుకు ప్రజ్వల్‌ను తీసుకుని గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి  పురుగుల మందుతాగింది. అనంతరం ఇంటికి చేరు కున్నారు. ఇంతలో ప్రజ్వల్‌ తన తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన రాజేశ్‌ లహరికను ఖానాపూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement